ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగు నెలలుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పాదయాత్రను ముగించుకొని ఈ రోజు శనివారం కృష్ణా జిల్లాలో ప్రవేశించారు.పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెజవాడలోని కనకదుర్గమ్మ
వారధి వద్ద ఆ తల్లి సాక్షిగా జగన్ పాదయత్ర కృష్ణా జిల్లాలో ప్రారంభమైంది.
అయితే జగన్ ఎంట్రీ సందర్భంగా జిల్లాలో ముఖ్యంగా బెజవాడ లో స్వాగత త్వరణాలతో ,ఎక్కడ చూసిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు .ఈ క్రమంలో జగన్ జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్ని వేలమంది జగన్ తో కల్సి పాదయాత్రలో పాల్గొన్నారు .అందులో భాగంగా జగన్ కనకదుర్గమ్మ వారధిపైకి వచ్చారు .
అయితే ఒక్కసారిగా అందరూ (కొన్ని వేలమంది)వంతెనపైకి రావడంతో వంతెన కొంచెం సేపు ఊగినట్లు అయింది .దీని గురించి స్థానికులు మాట్లాడుతూ అప్పట్లో తొమ్మిదేళ్ళ బాబు నిరంకుశ పాలనపై సమరశంఖం పూరించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పాదయాత్రలో భాగంగా వచ్చినప్పుడు పులకరించిన కనకదుర్గ వారధి నేడు ఆ మహనేత తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడంతో ఆయన పాదం తాకి ఆనందంతో పులకరించి డాన్సు వేసిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ..