రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో పయనిస్తున్న వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ది శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. ఇవాళ భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ట్యాంక్‌బండ్ దగ్గర ఆయన విగ్రహానికి మంత్రులు జగదీశ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి పూలమాలవేసి నివాళి అర్పించారు.
see also : ఇప్పటిదాకా వచ్చిన సర్వేలు ఒక లెక్క ..ఇది ఒక లెక్క .2019లో సీఎం ఎవరు ..!
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారా సామాజిక అంతరాలను రూపుమాపిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు.చిన్న రాష్ర్టాల ఏర్పాటుపై రాజ్యాంగంలో పొందుపర్చిన ఘనత అంబేడ్కర్‌కే దక్కుతుందని మంత్రి చెప్పారు. అందులో భాగంగానే తెలంగాణ ఏర్పాటు జరిగిందన్నారు. విద్యతోనే సమాజంలో రుగ్మతలను నిర్మూలించవచ్చని అంబేడ్కర్ నిరూపించి చూపించారని మంత్రి తెలిపారు. అంబేడ్కర్ ఆలోచనలతోనే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ముఖ్యమంత్రి కేసీఆర్ బలోపేతం చేస్తున్నారన్నారు. అంబేడ్కర్ ఆలోచనలను అక్షరం అక్షరం అమలు పరుస్తున్న ఘనత కేసీఆర్‌దని మంత్రి కొనియాడారు.