నన్ను అన్న అని పిలుస్తావా..! ఇకపై అలా పిలవొద్దు అంటూ ఇగో మూవీ చేస్తున్న సమయంలో తెలుగు సినీ ఇండస్ర్టీ బఢా నిర్మాత సురేష్ బాబు కొడుకు అభిరామ్ నన్ను రామానాయుడు స్టూడియోస్‌లో *** చేశాడని, నేను ట్రాన్స్ జెండర్ అని చెప్పినా కూడా అభిరామ్ నన్ను వదల్లేదంటూ సంచలన విషయాలను వెల్లడించింది చిన్న చిత్రాల్లో నటిగా రాణిస్తున్న సోనా రాథోడ్.
అయితే, తెలుగు సినీ ఇండస్ర్టీలో ఇతర రాష్ట్రాల నటులకంటే ఒకింత ఎక్కువ శాతం అవకాశాలు కల్పించాలంటూ నటి శ్రీరెడ్డి టాలీవుడ్‌పై యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, టాలీవుడ్ సినిమా రంగం ఇండస్ర్టీ కాదని, అది ఒక సెక్స్ ఇండస్ర్టీ అని, కమిట్‌మెంట్ ఇవ్వందే అకాశాలు ఇచ్చే ఛాన్సే లేదంటూ నిర్మాతల నుంచి టెక్నీషియన్స్ వరకు తెలుగు అమ్మాయిలను వాడుకుంటున్నారని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. సినీ రంగంలో కమిట్‌మెంట్‌పై ట్రాన్స్‌జెండర్ సోనా రాథోడ్ పలు విషయాలు వెల్లడించింది.
నూతన నటుడు ఆశిష్ నటించిన ఇగో మూవీలో నేను థార్డ్ హీరోయిన్‌గా నటించాను. ఆ సినిమా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ నగర పరిధిలో జరుగుతున్న సమయంలో నా మొబైల్‌కు నా ఫ్రెండ్ ఒక నెంబర్ పంపించింది. ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే నీకొక సినిమా అవకాశం వచ్చే ఛాన్స్ ఉందని నా ఫ్రెండ్ చెప్పడంతో.. ఆ నెంబర్‌కు ఫోన్ చేశా..! అప్పటి వరకు ఆ నెంబర్ ఎవరిదో.. నాకు తెలీదు అని ఇంటర్వ్యూలో చెప్పింది ట్రాన్స్ జెండర్ సోనా రాథోడ్.
అయితే, ఫోన్ చేసిన తరువాత, నా ఫోటోలు చూసిన అతను రామానాయుడు స్టూడియోస్‌కు రమ్మని చెప్పారు. అతను చెప్పిన ప్రకారం స్టూడియోస్‌కు వెళ్లిన తరువాత తెలిసింది.. నాకు ఫోన్ చేసింది నిర్మాత సురేష్‌బాబు కుమారుడు అభిరామ్ అని. ఆ తరువాత అభిరామ్ నన్ను అతని గదిలోకి పిలిచి.. మేమొక సినిమా తీస్తున్నాం, అందుకు ఆడిషన్స్ చేస్తున్నాం అని చెప్పారని సోనా రాథోడ్ చెప్పుకొచ్చింది. అయినా మీరు పంపిన ఫోటోల్లో అమ్మాయిలాగా ఉన్నారే.. కానీ, ఇప్పుడేమో ట్రాన్స్ జెండర్‌లా కనిపిస్తున్నారని అడగడంతో.. అవును సార్ నేను ట్రాన్స్‌జెండర్‌ని అని చెప్పా. సరే, మా సినిమాలో ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్ నీకే ఇస్తా అని అభిరామ్ చెప్పడంతో నేను ఓకే అన్నా అని అన్నా. అందుకు స్పందించిన అభిరామ్ వెంటనే నన్ను అన్నా అని అనొద్దు.. కావాలంటే సర్ అని పిలువు అని అభిరామ్ తనతో అన్నట్లు సోనా రాథోడ్ చెప్పింది.
మా సినిమాలో ట్రాన్స్‌జెండర్‌ను సెక్సీగా చూపించాలనుకుంటున్నాము. నీ ఒంటిమీద రాషెష్ ఉననాయా..? లేవా..? అని చూడాలి, అవి చూసేందుకు ప్రస్తుతం మా ఆఫీస్‌లో లేడీస్ లేరు. కాబట్టి అవి నేనే చెక్ చేస్తానంటూ అభిరామ్ తనపై చేతులు వేశాడని, ఆ సమయంలోనే నన్ను అభిరామ్ లొంగదీసుకున్నాడంటూ సోనా రాథోడ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏదేమైనా అభిరామ్ రాసలీలలంటూ శ్రీరెడ్డి విడుదల చేసిన ఫోటోలు టాలీవుడ్‌లో సంచలనం రేపుతుంటే.. ఇప్పుడు సోనా రాథోడ్ రామానాయుడు స్టుడియోస్‌లో అభిరామ్ రాసలీలంటూ చెప్పడం టాలీవుడ్‌లో మరింత అగ్గి రాజేసినట్టయింది.