రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ బాటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాట అని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.బి.ఆర్. అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా సిద్దిపేటలోని ఆయన విగ్రహానికి మంత్రి హరీశ్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ని పెట్టకపోయి ఉంటే తెలంగాణ ఏర్పడేది కాదని మంత్రి హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. . కేసీఆర్ ప్రభుత్వం ఒకే ఏడాది 150 గురుకులాలు ప్రారంభించిందని చెప్పారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు రూ.20 లక్షలు ప్రభుత్వం గ్రాంట్ రూపంలో ఇస్తున్నదని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలలను ఇంటర్ వరకు అప్ గ్రేడ్ చేసుకోవచ్చన్నారు.
ప్రభుత్వ విధానాలను, పాలసీలను ప్రజలు అందిపుచ్చుకుంటేనే బంగారు తెలంగాణ నిర్మాణం అవుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావుతో పాటు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.