భారత రాజ్యంగ నిర్మాత డా. బీ.ఆర్. అంబేడ్కర్ ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాతగానే నిలుస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు . ఇవాళ (ఏప్రిల్-14) అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన సేవలను స్మరించుకున్నారు. భారతీయ సమాజాన్ని అర్థం చేసుకుని భవిష్యత్ మార్గనిర్దేశం చేశారని ఈ సందర్భంగా కొనియాడారు. అంబేడ్కర్ మిగతా దేశాలకు, భారతదేశానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి భారత సమాజ పురోగతికి అవసరమైన ప్రణాళికలు రూపొందించారన్నారు. అంబేద్కర్ దూరదృష్టి, కాల్పనికత వల్లే దేశం ముందడుగు వేస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు.
కాగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురష్కరించుకుని అసెంబ్లీ ఆవరణలోగల అంబేడ్కర్ విగ్రహానికి శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.