ఏపీ అధికార టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ తనయుడు ,హిందూపురం అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ,టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలక్రిష్ణ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటి చేయరు అని కొంతమంది ..
లేదు నియోజకవర్గం మారి వేరే చోట పోటిచేస్తారు అని మరి కొంతమంది …అసలు రాజకీయాలకే దూరంగా ఉంటారు అని ఇంకొంతమంది ప్రచారం చేసిన సంగతి విదితమే .అయితే తనపై వస్తున్నా వార్తలపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు .
ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండే బరిలోకి దిగుతాను అని ఆయన తెలిపారు .అందుకే తనను గెలిపించిన ప్రజలను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నాను అని ఆయన అన్నారు ..