ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న అవినీతి.. అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా వైసీపీ అధ్యక్షుడు,ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఎంత విజయవంతంగా జరుగుతుందో 5 కోట్ల మంది ఆంధ్రులకే కాకుండ..దేశంలో ఎక్కడ చూసిన వైఎస్ జగన్ గురించి చర్చ అంతలా టీడీపీ చేస్తున్న అవీనితిని పాదయాత్ర చేసుకుంటూ.. ప్రజలకు తెలుపుతూ ప్రతి పక్షనేత ఎలా ఉండాలో నిరుపిస్తున్నాడు. గత నాలుగేళ్లగా పడుతున్న కష్టాలను తెలుసుకోవడానికి వందలాది మైళ్లు నడిచి వస్తున్న వైఎస్ జగన్‌కి పల్లెలన్నీ సాదరంగా ఘన స్వాగతం పలుకుతున్నాయి. మహానేత వారసుడిగా వైఎస్ జగన్ నేతృత్వం వహించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
జగన్ సీఎం అయితే నవరత్నాలతో పాటు సంక్షేమం వెల్లివిరుస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. తమ బతుకుల్లో సంతోషం చూడాలన్న జననేత సంకల్పం నెరవేరాలని పేదలు కోరుకుంటున్నారు. ఆప్యాయత, అనురాగాలు జోడించి ఆయన అడుగుల్లో అడుగులు వేయాలని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పాదయాత్ర కృష్ణా జిల్లాలో ప్రవేశించనున్న ప్రజా సంకల్ప యాత్రకు స్వాగతం పలికేందుకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వ పెద్దల వైఖరిని తూర్పారబట్టేందుకు జగనన్న వస్తున్నాడని నాయకులు ప్రచారం చేస్తుండగా.. పాదయత్ర కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపుతుంది. కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వస్తున్న వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర టీడీపీ శ్రేణుల్లో గుబులు పుట్టిస్తోంది. పాదయాత్ర యాత్ర అనంతరం టీడీపీ పునాదులు కదిలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రత్యేకహోదా అంశంలో వైసీపీ వ్యూహానికి తలకిందులైన టీడీపీ నాయకులపై నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.