ప్రస్తుత సమాజంలో ఎంతోమంది క్షణికావేశంలో నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కేరళకు చెందిన విద్యార్థిని తను అద్దెకు ఉంటున్న గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దొడ్డ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేరళకు చెందిన మంజు షా(24) పట్టణ శివారులోని కొడిగేహళ్లి సమీపంలోని ఆత్రేయ ఆయుర్వేద కళాశాలలో బీఏఎంఎస్ చదువుతోంది. కొడిగేహళ్లిలో దేవరాజు అనే వ్యక్తి ఇంట్లో ఒక్కత్తే అద్దెకు ఉంటోంది. మంజు షాకు కేరళకు చెందిన యువకుడితో వివాహం కూడా నిశ్చయమయింది. 10 రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. ఇదిలా ఉండగా గురువారం ఉదయం ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో పక్క గదిలో అద్దెకు ఉంటున్న మరో విద్యార్థిని తలుపులు తీసి ఉండడంతో తొంగి చూడగా మంజుషా ఉరివేసుకున్న సంగతి వెలుగు చూసింది. కిటీకీకి చీరతో ఉరివేసుకుంది. డీవైఎస్పీ మోహన్‌కుమార్, రూరల్ ఎస్‌ఐ రాజుగౌడ సిబ్బందితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
