టాలీవుడ్ బఢా నిర్మాతల్లో ఒకరైన హీరో వెంకటేష్ సోదరుడు దగ్గుబాటి సురేష్ బాబు నుంచి మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) సభ్యులకు 4 కోట్ల రూపాయలు అందాయి. శ్రీరెడ్డితో నిర్మాత సురేష్‌బాబు కుమారుడు అభిరామ్ నెరిపిన బెడ్రూమ్ రాసలీలలు మరిన్ని బయటపడతాయనే ఉద్దేశంతో.. ఆ రాసలీలల వీడియోలను, ఫోటోలను ఎలాగైనా బయటకు రాకుండా చేసేలా మా అసోసియేషన్ ద్వారా శ్రీరెడ్డితో చర్చలు జరిపే బాధ్యతను మా అసోసియేషన్‌కు అప్పగిస్తూ నిర్మాత సురేష్ కుమార్ శివాజీ రాజా అండ్ కోకు రూ.4 కోట్లు ఇచ్చారని, అందులో భాగంగానే
టాలీవుడ్ రాసలీలలపై శ్రీరెడ్డి చేస్తున్న పోరాటాన్ని ఆపేందుకు, శ్రీరెడ్డిని మా అసోసియేషన్లోకి ఆహ్వానిస్తున్నామంటూ ఎక్కడలేని ప్రేమను ఒలకపోస్తూ శివాజీ రాజా గురువారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారని సినీ క్రిటిక్ మహేష్ కత్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా.. శ్రీరెడ్డి, టాలీవుడ్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అలా కాకుండా, తెలుగు సినీ ఇండస్ర్టీలో తెలుగు వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారి జీవనోపాధికి తోడ్పాటునందించాలని డిమాండ్ చేస్తూ సినీ ఇండస్ర్టీపై యుద్ధం ప్రకటించింది. అయితే, టాలీవుడ్లో తెలుగువారికి అవకాశాలు దక్కకపోవడాని గల కారణాలను మీడియా వేదికగా శ్రీరెడ్డి బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తెలుగు నటీ నటులు నిర్మాతలతో, డైరెక్టర్లతో, హీరోలతో పడుకోకపోవడమే అవకాశాలు రాకపోవడానికి కారణమని బల్లగుద్ది మరీ చెప్పింది. ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లుగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న వారంతా అలా అవకాశాలు చేజిక్కించుకున్న వారేనంటూ మీడియా సాక్షిగా శ్రీరెడ్డి చెప్పిన విషయం విధితమే.
అయితే, శుక్రవారం ఓ ప్రముఖ ఛానెల్ డిబేట్లో పాల్గొన్న సినీ క్రిటిక్ కత్తి మహేష్ మాట్లాడుతూ.. అభిరామ్ బెడ్రూమ్ రాసలీలలను శ్రీరెడ్డి ఎక్కడ బయటపెడుతుందనే భయంతోనే నిర్మాత సురేష్‌బాబు మా అసోసియేషన్‌కు రూ.4కోట్లు ముట్టచెప్పారని, ఆ నేపథ్యంలోనే మా అధ్యక్షులు శివాజీ రాజా హఠాత్తుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ శ్రీరెడ్డికి సభ్యత్వం కార్డును కూడా ఫ్రీగా ఇస్తామంటూ చిలకపలుకులు పలికారని చెప్పారు కత్తి మహేష్.