ఏపీ అధికార టీడీపీ పార్టీలో విషాదం నెలకొన్నది .ఆ పార్టీకి చెందిన సీనియర్ మాజీ ఎమ్మెల్యే ఈ రోజు శుక్రవారం కన్నుమూశారు .రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ నాళ్లలో రెండు సార్లు 1985,1994లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రావి శోభనాద్రి ఈ రోజు కన్నుమూశారు .
ఆయనకు తొంబై ఐదు ఏళ్ళ వయస్సు ఉంటుంది .తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించిన నాటి నుండి టీడీపీలో కొనసాగుతున్న శోభనాద్రి ఇరవై ఐదేళ్ళ పాటు గుడివాడ అర్భన్ బ్యాంకు ఛైర్మన్ గా ఆయన పనిచేశారు .అప్పటి ఏపీ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ గా ఐదేళ్ళు పని చేశారు .
ఆయన తనయుడు కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు .అయితే రాష్ట్ర విభజన తర్వాత గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రావి శోభనాద్రి తనయుడు రావి వెంకటేశ్వరరావు వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే కొడాలి నాని చేతిలో ఓడిపోయారు .