వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలపై, అలాగే రాష్ట్ర విభజన నాటి నుంచి నేటికీ ప్రత్యేక హోదా సాధన కోసం తన స్టాండ్‌ను మార్చుకోకుండా ఉద్యమాలు, ధర్నాలు చేస్తూ ప్రజల్లో మరింత ఆదరణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో పలు మీడియా సర్వేలు, అలాగే రాజకీయ నాయకుల విశ్లేషణల్లో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగనే అన్న సూచనలు వెలవడిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలోని అధికార పార్టీ టీడీపీతో సహా మిగిలిన కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నాయకులు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకోగా.. ఇటీవల ముమ్మడివరం అసెంబ్లీ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మొత్తం మూడు వేల మంది కార్యకర్తలతో ,రెండు వందల మంది భారీ అనుచవర్గంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు . తాజాగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత యలమంచిలి రవి ఈ నెల 14వ తేదీన వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. !!
కర్నూలు జిల్లా టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని, అందుకు సంబంధించి ఏవీ సుబ్బారెడ్డి ఇప్పటికే వైసీపీ నేతలతో సంప్రదింపులు చేయడం ప్రారంభించారని, పాదయాత్ర చేస్తున్న జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు ఏవీ సుబ్బారెడ్డి తేదీ ఖరారు చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో ఓ కథనం వైరల్ అవుతోంది. అయితే, సోషల్ మీడియా కథనం సారాంశం పరిశీలిస్తే.. వివరాలిలా ఉన్నాయి..!!
ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ ఎన్నికలు జరిగేందుకు సంవత్సరం గడువు ఉన్నా.. ఇప్పటి నుంచే నంద్యాల రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ అటు ఏపీలోనే కాక.. ఇటు కర్నూలు జిల్లాలోనూ గడ్డు పరిస్థితినే ఎదుర్కోనుందని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. కర్నూలు జిల్లాలో టీడీపీ నేతల్లో విభేదాలు రావడమే ఇందుకు కారణం. ఇంతకాలం ఏపీ మంత్రి అఖిలప్రియ, ఎస్పీవై రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య వార్ చాపకింద నీరులా నడుస్తుండగా, ఇప్పుడు అది కాస్తా మీడియా సాక్షిగా బహిర్గతమైంది. అంతేకాకుండా, బహిరంగ సభలు పెట్టి మరీ ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, ఆళ్లగడ్డ నియోజకవర్గం అభివృద్ధి నిధులను మంత్రి అఖిల ప్రియ పక్కదోవ పట్టిస్తున్నారని టీడీపీ అధిష్టానానికి చెప్పినా పట్టించుకోకుండా.. మంత్రి అఖిల ప్రియ అవినీతికి చంద్రబాబు సర్కార్ సహకరిస్తోందని తన సన్నిహితుల వద్ద ఏవీ సుబ్బారెడ్డి వాపోయినట్లు సమాచారం.
మంత్రి అఖిలప్రియకు ప్రాధాన్యతనిస్తూ.. తనను చులకన భావనతో చూస్తూ పార్టీలో తన కేడర్‌ను తగ్గించేందుకు యత్నిస్తున్న టీడీపీ అధిష్టానం చర్యలను నిశితంగా పరిశీలించిన ఏవీ సుబ్బారెడ్డి.. చివరకు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారన్నది సోషల్ మీడియా కథనం సారాంశం.