తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న లోగుట్టును ఒక్కొక్కట్టిగా బయటపెడుతూ గత కొంతకాలంగా సినీ ప్రముఖులకు నిద్ర లేకుండా చేస్తున్న శ్రీరెడ్డి.. మరో అడుగు ముందుకు వేసి ఇటీవల హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.దీంతో నిన్న మా అసోసియేషన్ కూడా దిగొచ్చింది.అయితే నిన్న ఓ ప్రముఖ టీవీ చానెల్ నిర్వహించిన చర్చ కార్యక్రమంలో శ్రీరెడ్డితో పాటు పాల్గొన్న పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు శృతి, శ్రీవాణి తదితరులు నిర్మాత వాకాడ అప్పారావు గురించి సంచలన విషయాలు చెప్పారు.
ఈ సందర్భంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీవాణి.. నిర్మాత వాకాడ అప్పారావు గురించి సంచలన విషయం చెప్పింది.అప్పారావు పచ్చి కామాంధుడని,పడుకుంటేనే అవకాశాలు ఇస్తానని ముఖా ముఖిగా మాట్లాడుతారని అతని పై ఆరోపణలు చేసింది.మెగాస్టార్ చిరంజీవి సినిమా ఖైది నెం 150 సినిమా సమయంలో ఒక చిన్న అవకాశం కోసం పోటో తీసుకొని వెళ్ళాము.ఫోటో వెనుక మా ఫోన్ నెంబర్ రాసి అక్కడ ఇచ్చాము.అయితే అక్కడ ఆఫీసులో ఒక వ్యక్తికి అందరూ ఫోటోస్ ఇస్తున్నారు, మాకు చూసే టైమ్ కూడా లేకపోవడంతో..ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాకాడ అప్పారావుతో మాట్లాడాలని చెప్పి అతడి నెంబర్ ఇచ్చాడు.
ఆయనకు ఫోన్ చేసి చిరంజీవి సినిమా ఖైది నెం 150లో అవకాశం ఇప్పించండి సార్ అని అడిగితే…నీ వయసు ఎక్కువగా ఉంది, ఎవరైనా వయసులో(18 -22) ఉన్న అమ్మాయిని నాకు సెట్ చేస్తే.. మీ వయసుకు తగ్గ క్యారెక్టర్ ఇప్పిస్తాను అన్నాడు. అని క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీవాణి ఆరోపించారు.ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు, మేమే నటించడానికి వచ్చాము, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో ఒక్క క్యారెక్టర్ అయినా చేయాలని ఆశతో వచ్చాము.. మీరు ఈ విధంగా మాట్లాడటంమంచి పద్ధతి కాదని చెప్పాం. అపుడు దానికి అతడు గత 30 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నాను. ఇదంతా కామన్…. ఇది లేనిదే క్యారెక్టర్ ఉండదు. మీరు కొత్తవారు కాబట్టి మీకు తెలియక పోవచ్చు. ఇంతకు ముందు ఉన్న సీనియర్ ఆర్టిస్టులను ఎవరినైనా అడగండి అని అన్నారు. పడుకుంటే వచ్చే ఆఫర్ తనకు వద్దని వెళ్లి వచ్చానని ఆమె ఆ చర్చా కార్యక్రమంలో తెలిపారు.