టీఆర్ఎస్ పార్టీ అధినేత,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను గురువారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో ప్రముఖ యోగ గురువు బాబా రాందేవ్ కలిశారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై బాబా రాందేవ్ ప్రశంసల వర్షం కురిపించారు.రైతుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా గొప్పగా ఆలోచిస్తున్నారని..ఆయన ఆలోచనలు అద్భుతమని కొనియాడారు. ఇటువంటి సీఎంను తాను ఎక్కడా చూడలేదన్నారు.
రైతులకు ఏం కావాలో అది చేస్తున్నారు..ఎక్కువమంది ఆధారపడే వ్యవసాయ రంగాన్ని సుసంపన్నం చేసే సీఎం కేసీఆర్ ఆలోచన అద్భుతం అని బాబా రాందేవ్‌ప్రశంసించారు .రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని, రాష్ట్రాభివృద్ధికి సహకారం అందిస్తామని చెప్పారు.ఈ సందర్భంగా కేసీఆర్‌తో భేటీ తర్వాత రాందేవ్ తన ట్విటర్ ఖాతాలో ‘‘గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రైతు సంక్షేమం, సామాజిక న్యాయం విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన ఆలోచనతోపాటు కార్యదక్షతతో కూడిన ముందు చూపు ఉంది’’ అని ట్వీట్ చేశారు.