స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ,అను ఇమాన్యుయల్ జంటగా నటించిన చిత్రం నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా .ఈ సినిమా లోని ౩ వ పాటను శుక్రవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది.ప్రస్తుతం ఈ సినిమాలోని రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రాగా ..ఇవాళ విడుదల అయిన పెదవులు దాటని పదం పదం… అంటూసాగే పాట ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ గీతానికి విశాల్, శేఖర్ లు సంగీతం అందించారు.ఈ మూవీ మే 4వ తేదిన ప్రేక్షకుల ముందుకురానుంది.
