కోదండరాం కొత్త పార్టీకి భయపడేది లేదని పెద్దపల్లి ఎంపీ సుమన్ అన్నారు.ఇవాళ అయన ఓ ప్రముఖ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..కోదండరాం మొదటి నుండి కాంగ్రెస్ మనిషే నన్నారు.ఆ పార్టీ పెట్టె సభకు అనుమతి విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండదన్నారు.సభ అనుమతి విషయంలో వారు కోర్టుకు వెళ్ళారని..రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదన్న ఆరోపన్లో నిజం లేదన్నారు.
టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడమే కోదండరాం పని అని అన్నారు.రైతులకి నీళ్ళు ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదు ..అందుకే కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు.ఒక వైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మాజీ ముఖ్యమంత్రులు,మంత్రులు , ఇతర నేతలు అధికారులు మెచ్చుకుంటుంటే..కోదండరాంకు అది మంచి ప్రాజెక్ట్ గా కనపడటం లేదన్నారు.వచ్చే ఎన్నికల్లో ఎంపీ సుమన్ ఎమ్మెల్యే గా పోటి చెయ్యబోతున్నారు..క్యాబినెట్ లో ఉండబోతున్నారు అని మీడియా విలేఖరు అడుగగా..ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ ఏ భాద్యత అప్పగిస్తే అది చేస్తా అని నాకంటూ సొంత అభిప్రాయాలూ ఏమీ లేవన్నారు.