కాస్టింగ్ కౌచ్. ఇప్పుడు హాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్.. టాలీవుడ్ వరకు వినిపిస్తున్న పదం. హాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలీదు కానీ.. టాలీవుడ్‌లో మాత్రం దీని ప్రభావం పీక్ స్టేజ్‌కి వెళ్లిందన్నది సినీ విశ్లేషకుల మాట. అయితే, ఇటీవల కాలంలో తెలుగు నటీమణులు అపూర్వ, శ్రీరెడ్డి మొదలుకొని, కరాటే రాణి వంటి వారు టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ గురించి మీడియా సాక్షిగా బహిరంగంగా మాట్లాడిన విషయం తెలిసిందే. వారిలో శ్రీరెడ్డి ఒక అడుగు ముందుకేసి టాలీవుడ్‌లో ప్రొడ్యూసర్లు, హీరోలు, డైరెక్టర్ల నుంచి.. టెక్నీషియన్స్ వరకు అవకాశాల పేరిట నటీమణులను వాడుకుని వదిలేసే వారే ఎక్కువని, అలా అవకాశాలు కోసం ఆశపడి లైంగికంగా వారి చేతిలో నలిగిపోయిన వారిలో నేను ఉన్నానంటూ శ్రీరెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.
తాజాగా, నటి అపూర్వ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. సంచలన విషయాలను వెల్లడించింది. చలన చిత్ర పరిశ్రమలో శ్రీరెడ్డిలా మోసపోయిన వారి జాబితా చాలా పెద్దదేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీరెడ్డి ఒక్కసారిగా బయటకు రావడంతో.. చాలామంది మహిళా క్యారెక్టర్ ఆరిస్టులు.. వారు పడుతున్న బాధలను నాతో చెప్పుకొచ్చారని, అందులో ఓ మహిళ తనతో ఈ విధంగా చెప్పిందంటూ.. ఆ విషయాన్ని మీడియాకు వెల్లడించింది.
అక్కా..!! షూటింగ్ అని చెప్పి తీసుకెళ్లారక్కా.. అక్కడికి వెళ్లిన తరువాత షూటింగ్ లేదు..ఏమీ లేదక్కా..! చివరకు పక్కలోకి రమ్మని చేయి లాగాడక్కా అని తనముందు ఓ మహిళ బోరన విపించిన విషయాన్ని నటి అపూర్వ గుర్తు చేసింది. ఆ సమయంలో ఆ మహిళ బిడ్డుకు పాలు ఇస్తున్నా కూడా.. ఆ కామాంధులు ఏమన్నారో తెలుసా..? బిడ్డకు పాలు తరువాత ఇవ్వొచ్చులే.. ముందు నువ్వు రా..!! అంటూ నన్ను లాక్కుపోయారక్కా అని చెప్తూ కన్నీరుమున్నీరుగా ఆ మహిళ తనముందు విలపించిందని అపూర్వ తెలిపింది.