ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు ఈ వారం బాగా కల్సి వచ్చిందనే చెప్పాలి .దేశ వ్యాప్తంగా కొనుగోళ్ళతో ఆరు రోజులుగా మార్కెట్లు లాభాలతో ముగిశాయి .అందులో భాగంగా వారంలో చివరి రోజైన శుక్రవారం మార్కెట్లు లాభాలతోనే ముగిశాయి .సెన్సెక్స్ వంద పాయింట్లకు పైగా లాభాలతో ట్రేడింగ్ ను
మొదలుపెట్టింది.ఒకానొక సమయంలో నూట తొంబై పాయింట్ల వరకు లాభపడింది .
కానీ ఈ రోజు శుక్రవారం ఇన్ఫోసిస్ ఫలితాలపై దృష్టి పెట్టిన మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు .అయితే బ్యాంకింగ్ షేర్లు కూడా నష్టపోవడంతో సూచీలు ఆరంభ లాభాల్లో కొంత నష్టపోవాల్సి వచ్చింది .శుక్రవారం నాటికి మార్కెట్లు ముగిసే వరకు సెన్సెక్స్ తొంబై రెండు పాయింట్లు లాభపడి ముప్పై నాలుగు వేల నూట తొంబై మూడు వద్ద ,నిఫ్టీ ఇరవై రెండు పాయింట్ల స్వల్ప లాభాలతో పదివేల నాలుగు వందల ఎనబై ఒకటి దగ్గర స్థిరపడ్డాయి .
అదానీ ఫోర్ట్స్,టెక్ మహేంద్రా,ఐషర్ మోటార్స్ ,హిందాల్కో ,ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ స్థిరపడ్డాయి ..భారత్ పెట్రోలియం ,హెచ్ సీఎల్ టెక్నాలజీ ,బజాజ్ ఫైనాన్స్ ,ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ,స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా షేర్లు నష్టపోయాయి ..