తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో విసృతంగా పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి నెక్నాంపూర్ చెరువు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల ఉన్న 40 చెరువులను జీహెచ్ఎంసీ ద్వారా రూ. 441 కోట్లతో అభివృద్ది చేస్తున్నామని వెల్లడించారు.
హెచ్ఎండీఎ ద్వారా మరో 38 చెరువుల అభివృద్ది చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రం లో 46000 చెరువులను మిషన్ మోడ్ లో అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. చెరువుల అభివృద్ది పర్యవేక్షణకు యువ ఐఏఎస్ అధికారి నేతృత్వం వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.చెరువుల్లో మురుగు నీరు కలువకుండా సీవరెజి ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు.