దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుచేయాలని టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన ఫ్రంట్‌పై ఆసక్తిగా ఉన్న పార్టీల అధినేతలతో సమావేశమవుతున్నారు. మొదటగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీతో భేటీ అయ్యారు. ఫ్రంట్ పట్ల ఆమె ఆసక్తి కనబరిచారు.
అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ బెంగుళూర్ వెళ్లనున్నారు,ఈ పర్యటనలో భాగంగా మాజీ ప్రధాని ,జనతాదళ్ అధినేత దేవెగౌడ తో బేటీ కానున్నారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఇవాళ ఉదయం 9.45 గంటలకు హైదరాబాద్ మహానగరం నుంచి విమానంలో బెంగళూరు వెళుతున్నారు. మధ్యాహ్నం 2.00 గంటలకు బెంగళూరులోని దేవెగౌడ నివాసం అమోఘలో ఇద్దరు సమావేశమవుతారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నట్లు సమాచారం.మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ తిరిగి వస్తారు.