ఏపీ అధికార పార్టీ టీడీపీ సీనియర్ నేత ,అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రధానమంత్రి నరేందర్ మోదీపై మరోసారి నిప్పులు చెరిగారు .గత కొంతకాలంగా టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శల పర్వం కురిపించుకుంటున్న సంగతి తెల్సిందే.
తాజాగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఏపీకి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమి చేయలేదు .నాలుగు ఏండ్లుగా అది చేస్తా ఇది చేస్తా అంటూ మోసం చేశారు .ఏపీ ప్రజలను మోదీ ఏమి చేయలేరు .తెలుగు ప్రజల సత్తా ఏమిటో ప్రధాన మంత్రి నరేందర్ మోదీకి చూపించాలని ఆయన ప్రజలను కోరారు .ఏపీ ప్రజల భవిష్యత్తు మారాలంటే చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరారు ..