తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళ బెంగుళూర్ లో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా జనతాదళ్ అధినేత హెచ్‌డీ దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. బెంగళూరులోని దేవెగౌడ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఎంపీలు వినోద్, సంతోష్ కుమార్ నటుడు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై దేవెగౌడతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు.
అనంతరం దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తో దేశ రాజకీయాలపై చర్చించడం చాలా సంతోషంగా ఉందన్నారు .గ్రామీణాభివృద్ది,బలహీన వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పాటు పడుతున్నదని ..గర్భిణీల కోసం తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టిందన్నారు.తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి తెలంగాణలో మిషన్ భాగీరధ పథకం చేపట్టడం అభినందనీయం అని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలబడటం సంతోషకరం అని..కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ లో జనరంజక పాలనా కొనసాగుతున్నదని ఈ సందర్భంగా దేవెగౌడ కొనియాడారు.దేశంలో రైతులు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారని..దేశంలో రైతుల ఆత్మహత్య లు పెరిగాయని చెప్పారు.