మాది రాజకీయాల ఫ్రంట్ కాదని .. దేశప్రజల సమగ్ర అభివృద్దే మా లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఇవాళ జనతాదళ్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశమయ్యారు. బెంగళూరులోని దేవెగౌడ నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్‌కు దేవెగౌడ స్వయంగా ఎదురెల్లి స్వాగతం పలికారు.భేటీ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన సమయంలోనూ దేవెగౌడ మాకు మద్దతుగా నిలిచారన్నారు.తెలంగాణ ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చేందుకు నిర్వహించిన భారీ సభలో దేవెగౌడ స్వయంగా పాల్గొన్నారని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.దేశ ప్రజల అకా౦క్షలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ,బీజేపీ ఘోరంగా విఫలమయ్యాయి అని..మన దేశంలో 70 వేల టీఎంసీల నీళ్ళున్నాయని..పాలకులకు చిత్త శుద్ధి ఉంటే ప్రతి ఎకరానికి సాగు నీరు అందించవచ్చు అని అన్నారు.
రాష్ట్రాల మధ్య నీటి సమస్యను ఇప్పటివరకు పరిష్కరించలేక పోతున్నారని చెప్పారు.కావేరీ జలాల సమస్య ఇంతవరకు పరిష్కారం దొరకలేదన్నారు.కాంగ్రెస్ ,బీజేపీ పార్టీ లు ఈ దేశాన్ని పాలించాయని..వారి లోప భూయిస్టామైన విధానాల వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం కేసీఆర్ చెప్పారు.