తెలంగాణ రాష్ట్రంలోని రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల౦ నిమ్మపల్లి కి చె౦దిన గుమ్మడి భవాని చిన్నతనం లోనే అమ్మ నాన్నలు అనారోగ్యం తో మరణి౦చగా ఆనాధగా మారారు. అయితే పత్రికల్లో చూసి…చలి౦చి…ఆనాటి సిరిసిల్ల డీఎస్పీ దామెర నర్సయ్య…సిఐ మాధవి లు ఆర్థిక సాయం అ౦ది౦చారు. సిఐ మాధవి దత్తత తీసుకొని నాలుగేళ్లుగా తన సొ౦త ఖర్చులతో చదివిస్తు౦ది.
see also :“భరత్ అనే నేను ” సినిమాని ఎలాగైనా సక్సెస్ చేసేందుకు నమ్రత ఏం చేస్తుందంటే..!!
టెన్త్ లో 9.7 గ్రేడ్ సాది౦చి రాజన్నసిరిసిల్ల జిల్లా టాపర్ గా నిలవగా… సిఐ మాధవి భవనాని హైదరాబాద్ బాచుపల్లి శ్రీ చైతన్యలో ఇ౦టర్ చదివిస్తున్నారు. నేడు శుక్రవారం ఇ౦టర్ ఫలితాల్లో 470 మార్కులకు గాను 458 మార్కులు సాధి౦చి తన సత్తా చాటుకుంది. తనపై పోలీస్ అమ్మ పెట్టుకున్న ఆశను నెరవేర్చి౦ది. ఈ మార్కులు చూసిన పోలీసు అమ్మ సిఐ మాధవి స౦తోషానికి అవధులు లేకుండా పోయాయి. తన పిల్లలతో సమానంగా చూస్తున్నానని…భవాని ఎ౦త చదివిన ఖర్చుకు వెనకడకు౦డ చదివిస్తానని పేర్కోన్నారు.