ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నయి.తమకు ఓట్లేసి గెలిపించిన స్థానిక ఓటరు దగ్గర నుండి ..అధికారాన్ని అడ్డుపెట్టుకొని తెలుగు తమ్ముళ్ళు చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్న సామాన్యుడి దగ్గర నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలవరకు అందరిపై అక్రమ కేసులు బనాయించి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు .
తాజాగా తాడిపత్రిలో వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్ రెడ్డి తన ఇంట్లో ఉండగా బాలచంద్ర అనే ఒక ఆగంతుకుడు ఇంట్లోకి చొరబడి హత్యాయత్నం చేశాడు.దీంతో తన ప్రాణ రక్షణ మేరకు తనకు సర్కారు కేటాయించిన లైసెన్స్ తుపాకీతో ఆ ఆగంతుకుడిపై కాల్పులు జరిపాడు .అయితే ఈ క్రమంలో రమేష్ రెడ్డి నేరుగా వ్యక్తిపైకి కాకుండా భయానికి గురిచేయడానికి ఇంటి గోడలపైకి కాల్చాడు .
అయితే ప్రమాదశావత్తు బులెట్ గోడకి తగిలి బాలచంద్ర కాళ్ళకు తగిలింది.దీంతో పోలీసులు బాలచంద్రకు మతిస్థిమితం లేదని ..రమేష్ రెడ్డి కావాలనే కాల్పులు జరిపాడు అని అక్రమకేసులు బనాయించారు.అయితే ఆగంతుకుడుని పట్టుకోకుండా ఎటువంటి విచారణ చేయకుండానే మతిస్థిమితం లేదని వదిలేశారు పోలీసులు ..రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది అధికార టీడీపీ నేతల ఓటమి భయం ఎక్కువవుతుండటంతో ఎక్కడ తమకు పోటి వస్తారేమో అని వైసీపీ నేతలపై సంబంధం లేని అక్రమ కేసులు బనాయిస్తున్న సంగతి తెల్సిందే .