భారతదేశంలోనే అతి పెద్ద టెలికామ్ నెట్వర్క్ అయిన ఎయిర్‌టెల్ మేరా పెహలా స్మార్ట్‌ఫోన్ అనే ఆఫర్ తో అద్భుతమైన ప్రయోజనం అందించనుంది. ఈ ఆఫర్ ద్వారా… ఇప్పటికీ ఎయిర్‌టెల్ 2జీ లేదా 3జీ ఫోన్లు వాడుతున్నవారు 4జీ నెట్వర్క్ లోకి మారితే… వారికి 30 జీబీ డేటాను ఉచితంగా అందించనుంది.
see also : సిఐ మాధవి దత్త పుత్రిక కు ఇ౦టర్ లో 457/470..
ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులందరికీ ఈ ఆఫర్ వర్తించనుంది. ప్రీపెయిడ్ వినియోగదారులకు రోజుకు 1 జీబీ డేటా చొప్పున 30 రోజులకు 30 జీబీ డేటాను అందించనుంది. అదే పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు మాత్రం 30 జీబీ డేటాను ఒకేసారి అందించనుంది ఎయిర్ టెల్ .