ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. అశేశ జన ప్రభజనం మద్య వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారు. కగా నేడు ప్రజాసంకల్పయాత్ర 135వ రోజుకు చేరుకుంది. గురువారం ఉదయం ఉండవల్లి శివారు నుంచి వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి పట్టాభిరామయ్య కాలనీ, మహానాడు, సుందరయ్యనగర్ మీదుగా పాదయాత్ర మణిపాల్ ఆస్పత్రి వరకు కొనసాగనుంది.
