బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ వరల్డ్ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.తాజాగా ఇవాళ విడుదల చేసిన బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్‌లో అతను టాప్ ప్లేస్‌లో నిలిచాడు. భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్లలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన రెండవ ప్లేయర్‌గా శ్రీకాంత్ నిలిచాడు. పురుషుల విభాగంలో చైనా ప్లేయర్లు డామినేట్ చేసే బ్యాడ్మింటన్‌లో ఇండియన్ షట్లర్‌కు నెంబర్ వన్ ర్యాంక్ రావడం గర్వకారణం. ఇది నిజంగా మన దేశానికి ఎనలేని ప్రతిష్టను తీసుకువచ్చింది. ఇప్పటికే కామన్‌వెల్త్ గేమ్స్‌లో శ్రీకాంత్ జోరు మిదుండగా… తాజా ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్‌కు 76895 పాయింట్లు రాగా, డెన్మార్క్ ప్లేయర్ అలెక్సన్‌కు 75470 పాయింట్లు వచ్చాయి.మాడ్రన్ ర్యాంకింగ్స్‌లో సైనా నెహ్వాల్ కూడా ఎలైట్ లిస్టులో ఉంది..
Ladies & Gentlemen…. Srikanth is now officially World No. 1 in latest BWF rankings. He has joined Saina Nehwal in the elite list to become only the second Indian Badminton player to achieve the feat in modern ranking era. Game changing moment for Indian Sports #ProudMoment pic.twitter.com/rr41CxMKHH
— India@Sports (@India_AllSports) April 12, 2018