Home / MOVIES / టాలీవుడ్ ఎంగిలి మెతుకులు తిన్న నీవు..! చ్ఛి..చ్ఛీ!!

టాలీవుడ్ ఎంగిలి మెతుకులు తిన్న నీవు..! చ్ఛి..చ్ఛీ!!

టాలీవుడ్‌లో తెలుగువారికి కూడా అవ‌కాశాలు క‌ల్పించాలని, ఎంతో ఆస‌క్తితో, ప్యాష‌న్‌తో సినిమాల్లో న‌టించాల‌ని వ‌స్తున్న తెలుగు అమ్మాయిల‌ను ప్రొడ్యూస‌ర్లు, డైరెక్ట‌ర్లు, సినిమా టెక్నీషియ‌న్లు వాడుకునే రోజులు పోవాల‌ని నేను పోరాటం చేస్తున్నా, అంతేత‌ప్ప మ‌రెవ‌రి మీద వ్య‌క్తిగ‌త క‌క్ష‌తో నేను పోరాటం చేయ‌డం లేదు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది శ్రీ‌రెడ్డి. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శ్రీ‌రెడ్డి మాట్లాడుతూ.. ప్ర‌తీ ఒక్క‌రూ.. నేను బ‌ట్ట‌లు విప్పేశా.. నువ్వు బ‌ట్ట‌లు విప్పేశావు అని మాట్లాడుతున్నారు.. వారంద‌రినీ నేను ఒక్క‌టిటే అడ‌గ‌ద‌లుచుకున్నా..! నేను ఎవ‌రికోసం బ‌ట్ట‌లు విప్పానో మీకు తెలీదా..? భ‌విష్య‌త్తులో సినిమా ఇండ‌స్ర్టీపై ఆస‌క్తితో వ‌చ్చే అమ్మాయిల‌కు నాలాగా బ‌లి కాకూడ‌ద‌నే ఉద్దేశంతోనే నేను బ‌ట్ట‌లు విప్పానే త‌ప్ప‌.. అందులో మ‌రే ఉద్దేశం లేద‌ని స్ప‌ష్టం చేసింది శ్రీ‌రెడ్డి.

see also :

మ‌రో ఇద్ద‌రి పేర్లు బ‌య‌ట‌పెట్టిన శ్రీ‌రెడ్డి..!!

శ్రీ‌రెడ్డి జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాన్ గురించి మాట్లాడుతూ.. ప్ర‌జా స‌మ‌స్య‌లంటూ వేదిక‌ల‌పై స్ర్కిప్టులు చ‌దివే ప‌వ‌న్ క‌ల్యాణ్.. నేడు టాలీవుడ్‌లో ఇంత పెద్ద విష‌యంపై చ‌ర్చ జ‌రుగుతున్నా కూడా స్పందించ‌క‌పోవ‌డం బాధాక‌ర‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది శ్రీ‌రెడ్డి. ఇంత‌కాలం సినిమా పెట్టిన మెతుకులు తిని.. ఇప్పుడు అదే సినిమా ఇండ‌స్ర్టీలోని మ‌హిళ‌లు ఇబ్బందుల్లో ఉంటే ప‌ట్టించుకోక‌పోవ‌డం దారుణం అన్నా.., ఈ విష‌యంపై ఇప్పుడు ప్ర‌పంచ‌మంతా చ‌ర్చించుకుంటోంది. అటువంటిది ఈ విష‌యం మీ చెవిదాక వ‌చ్చింద‌ని నేను భావిస్తున్నా.. అయినా మీరు స్పందించ‌క‌పోవ‌డం క‌రెక్టు కాదు అన్నా.

see also : అభిరామ్‌..నువ్వు ఏంట్రా..! అస‌లు నీకు సిగ్గుందా..!! న‌న్ను ఎలా వాడుకున్నావో.. నాకు తెలుసు..!!

సినీ హీరో ద‌గ్గుబాటి వెంక‌టేష్‌, మీరు (ప‌వ‌న్ క‌ల్యాణ్‌) క‌లిసి గోపాల‌, గోపాల సినిమాలో న‌టించారు క‌దా అన్నా, ఆ సినిమా ఆడియో ఫంక్ష‌న్‌లో మేమిద్ద‌రం ఎప్పుడు క‌లిసినా ఆధ్యాత్మికం గురించే మాట్లాడుకుంటాం అని మీరు (ప‌వ‌న్ క‌ల్యాణ్‌) చెప్పారు క‌ద‌న్నా.., అటువంటి ఆధ్యాత్మికం గురించే మాట్లాడుకునే కుటుంబంలోని వ్య‌క్తి సినిమా అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని చెప్పి, నాపై ఇలాంటి లైంగిక దాడి చేశాడ‌న్నా, అలాంటి వ్య‌క్తికి శిక్ష ప‌డేలా చేయ‌మ‌ని చెప్పు అన్నా,

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat