ఏపీలో అధికార టీడీపీ పార్టీకు చెందిన నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేయని నేరాలు లేవు ..ఘోరాలు లేవు .ఆఖరికి తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను ,స్థానిక ఓటర్లను వేధిస్తూ దాడులకు తెగ బడుతున్నారు.ఈ క్రమంలో పీసీపల్లి వైఎస్సార్ సర్కిల్ లో గత ఎనిమిది ఏండ్లుగా నీలం అమర నాథ్ సాయంత్రం సమయంలో ఒక బండి పెట్టుకొని టీ టిఫెన్ సెంటర్ను
పెట్టుకొని బ్రతుకు బండి నడిపించుకుంటున్నాడు.
అయితే తను నడుపుతున్న టిఫెన్ సెంటర్ ఉన్న స్థలం మాదంటూ అధికార టీడీపీ పార్టీకి చెందిన మండల నాయకుడు ,జిల్లా పాలకేంద్రం డైరెక్టర్ పులి వెంకటేశ్వరరెడ్డి జేసీబీ సాయంతో ఆ బండిని తీసుకెళ్ళాడు .అంతే కాకుండా అడ్డొచ్చిన అమరనాథ్ ను కులం పేరుతొ దూషించడమే కాకుండా ఏకంగా దాడులకు తెగ బడ్డాడు సదరు నాయకుడు .దీంతో బాధితుడు అమరనాథ్ స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు ..