తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న లోగుట్టును ఒక్కొక్కట్టిగా బయటపెడుతూ గత కొంతకాలంగా సినీ ప్రముఖులకు నిద్రలు లేకుండా చేస్తున్న శ్రీరెడ్డి మరో అడుగు ముందుకు వేసి ఇటీవల హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. దీంతో మా అసోసియేషన్ వారు ప్రెస్ మీట్ పెట్టి శ్రీ రెడ్డిని ఎవరు సినిమా ఇవకాశం ఇవ్వకూడదని హూకుం జారీ చేశారు. దీంతో తనకు మద్దతుగా ఒక్కరు కూడా రాలేదని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే శ్రీరెడ్డి పోరాటానికి ఊహించని మద్దతు లభించింది. ఆమెను సినిమాల్లో నటించకుండా ఆంక్షలు విధించడం శ్రీరెడ్డి హక్కులకు భంగం కలిగించడంగా భావించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) తెలంగాణ, కేంద్ర సమాచార ప్రసారశాఖకు నోటీసులు జారీ చేసి.. ఆమెకు గుడ్ న్యూస్‌ని అందించింది. శ్రీరెడ్డి ఆరోపణలను ఎన్‌హెచ్‌ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. సమస్య పరిష్కార యంత్రాంగం లేకపోవడం పెద్ద లోటు అని మానవ హక్కుల సంఘం అంటోంది. తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై… తెలంగాణ, కేంద్ర సమాచార ప్రసారశాఖకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు ఇష్యూ చేసింది. సినిమాల్లో నటించకుండా ఆంక్షలు విధించడం… శ్రీరెడ్డి హక్కులకు భంగం కలిగించడమేనని ఎన్‌హెచ్‌ఆర్సీ అభిప్రాయపడింది.