‘కాస్టింగ్ కౌచ్’ పేరుతో సినీ ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయంటూ నటి శ్రీరెడ్డి గత కొద్దిరోజులుగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ శనివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఫిలించాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసి తన నిరసన చేసిన విషయం తెలిసిందే.అయితే ఆమె చేసిన పోరాటం ఫలించింది.
ఆమె విమర్శలు, సాక్ష్యాల దెబ్బకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) కాళ్లబేరానికి దిగొచ్చింది.ఆమెపై నిషేధాన్ని ఎత్తేసింది. ఆమెతో 900 మంది ‘మా’ నటులు కలసి నటిస్తారని మా అధ్యక్షుడు శివాజీ ఇవాళ సాయంత్రం విలేకర్ల సమావేశం పెట్టి మరీ ప్రకటించాడు. ఆమెపై తమకు కోపం లేదని, ఆమె తమ కుటుంబ సభ్యురాలని చెప్పారు.అంతేకాకుండా అమ్మాయిలపై లైంగిక వేధింపులపై దర్యాప్తు కోసం మా.. కమిటీ అగైనెస్ట్ సెక్సువల్ హరాస్మెంట్(క్యాష్)ను కూడా ఏర్పాటు చేసింది. బాధితులు ఎవరైనాసరే ఈ కమిటీ ముందుకొచ్చి ఫిర్యాదు చేయొచ్చు అని తెలిపింది .