తెలుగు నేర్చుకుంటున్ననారా లోకేష్..!! అవును మీరు చదివింది నిజమే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలుగులో మాట్లాడటానికి శిక్షణ తీసుకుంటున్నాడు.ఇదుకోసం రాష్ట్ర ప్రభుత్వం బుధవారం G.O. RT.No.168 తో జివో జారీ చేసింది.లోకేష్ కు తెలుగు నేర్పుతున్న గురువు పేరు పెద్ది రామారావు.2009 ఎన్నికల్లో ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా పెద్ది రామారావే గురువుగా వ్యవహరించారు.
మాట్లాడేటప్పుడు తప్పులు మాట్లాడే నారా లోకేష్‌ను ఎప్పటికప్పుడు గైడ్ చేసే గురువు పెద్ది రామారావును గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా మండలి సభ్యుడిగా నియమించింది. ఈ క్రమంలో పెద్ది రామారావును తెలుగు శిక్షకుడిగా లోకేష్ నియమించుకున్నారు.ఆయనకు నెలకు రూ. లక్ష జీతం , హెచ్‌ఆర్‌ఏ కింద రూ. 35 వేలు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రభుత్వ సలహాదారుతో సమానంగా ఇతర అలవెన్సులన్నీ వర్తింపజేయాలంటూ ప్రణాళికా శాఖ కార్యదర్శి సంజయ్‌గుప్త ప్రకటించారు.