సాధారణంగా మన ఇంట్లో సోంపు సామాను పెట్టెలో తప్పకుండ కనిపించేవి మెంతులు.రోజు మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతూ ఉంటాం.అయితే మెంతులలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.మెంతులను అనేక పచ్చళ్లలోనే కాకుండా సౌందర్య లేపనంగా దీనిని వాడుతుంటారు.జుట్టు రాలడం,చుండ్రు లాంటి అనేక సమస్యలనుండి కాపాడటానికి మెంతులు అద్భుతంగా పని చేస్తాయి.మెంతుల వల్ల కలిగే అనేక ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- రాత్రి పూట పడుకునే ముందు మెంతులను నీటిలో నానబెట్టి ఉదయం పూట పరిగాడుపున ఆ నీటిని త్రాగడం వలన జీర్ణశక్తి వృద్ది అవుతుంది.తద్వారా గ్యాస్టిక్ సమస్యలు తగ్గుతాయి.
- రాత్రి పూట కేవలం ౩ స్పూన్ల మెంతులను నీటిలో నానబెట్టి ఉదయం పూట పేస్ట్ చేసి దానికి ఒక స్పూన్ పెరుగును కలిపి తలకు బాగా పట్టించి ఒక అరగంట తరువాత తలంటు స్థానం చేస్తే చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా ,నల్లగా పెరుగుతుంది.ఈ విధంగా ఒక వారంలో ౩ సార్లు చేయడం వలన అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు.
- మెంతి ఆకులకు కొన్ని తులసి ఆకులను కలిపి మెత్తగా పేస్టులా చేసి ముఖానికి పట్టిస్తే మీ ముఖం పై ఉన్న మచ్చలు ,మొటిమలు తగ్గడమే కాకుండా చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
- సాధారణంగా శరీరంలో ఫ్రీరాడికల్స్ వల్ల చర్మం ముడుతలు పడుతుంది.నలుపు వలయాలు ఏర్పడుతాయి..అయితే స్కిన్ టోన్ అనే తేలికపరిచే గుణం మెంతులు కలిగి ఉండటం వల్ల వాటిని అడ్డుకుంటాయి.