తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్విట్టర్ లో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ ” సహాయం చేయండి సర్ ” అని ఎవ్వరైనా ట్వీట్ చేస్తే చాలు..వెంటనే స్పందించి ..తక్షణ సహాయం అందేలా చేస్తారు.అయితే మంత్రి కేటీఆర్ ఇవాళ ఓ సామాన్య పౌరుడికి క్షమాపణ చెప్పి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.తనవల్ల ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలని కోరారు.
అసలేం జరిగిందంటే.. ఐదు రోజుల కిందట రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం శివారులోని దమ్మాయిగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జితేందర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోడ్డుపై ఆ సమయంలో కేటీఆర్ కాన్వాయ్ వెళ్తోంది. జితేందర్‌ను ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో అతడు 20 నిమిషాలు రోడ్డుపై నరకయాతన అనుభవించాడు. మంత్రిగారి కాన్వాయ్ వెళ్లిపోయా స్పత్రికి వెళ్లాడు.
ఈ అమానవీయ ఘటనపై ఓ ఆంగ్ల పత్రికలో ఇవాళ కథనం వచ్చింది.దీన్ని ఓ నెటిజన్ ట్విటర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి వెంటనే స్పందిస్తూ.. ‘ఇది నిజం కాకూడదని కోరుకుంటున్నాను.. నా పనితీరు ఎప్పుడూ అలా ఉండదు. ఒకవేళ అది నిజమైతే ఆ జెంటిల్‌మెన్‌కు క్షమాపణలు చెబుతున్నాను. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలనిడీజీపీని కోరుతున్నాను.. ‘ అని ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ తాను ఒక ముఖ్యమంత్రి కొడుకు, మంత్రి అనే గర్వానికి పోకుండా సామాన్యుడికి క్షమాపణ చెప్పి పెద్దమనసు చాటుకున్నారని కితాబిస్తున్నారు.
ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు.. రహదారిపై వీవీఐపీల కాన్వాయ్ వెళ్తున్నా.. అంబులెన్స్‌లకు దారి ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే విషయపై డీజీపీ మహేందర్ రెడ్డి.. పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు.
I certainly hope it’s not true because that’s never been my way of working
If it’s true, my most sincere apologies to the gentleman ? and I also request @TelanganaDGP to ensure that instructions are passed on to policemen so this is not repeated anywhere https://t.co/Sk3YKgBXiT
— KTR (@KTRTRS) April 12, 2018