Home / ANDHRAPRADESH / సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుకు ఘోర అవమానం ..!

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుకు ఘోర అవమానం ..!

ఏపీ రాష్ట్ర సీపీఎం నేత మధుకు రాష్ట్రంలోని విజయవాడ లోని జనసేన పార్టీ కార్యాలయంలో తీవ్ర చేదు అవమానం ఎదురైంది .ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు గురువారం విజయవాడ లోని పార్టీ కార్యాలయంలో వామపక్ష నేతలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు .

అందులో భాగంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటుగా ఆ పార్టీకి చెందిన నేతలు ఈ సమావేశానికి వచ్చారు .అయితే కార్యాలయం లోపలకి వెళ్ళుతుండగా సెక్యూరిటీ సిబ్బంది వారినీ అడ్డుకున్నారు.ఈ ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది సమావేశానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదని ..లోపలకు అనుమతి లేదని చెప్పారు .

దీంతో వారు గేటు ముందే నిలబడి పోయారు .అయితే ఆ సమయంలోనే ఖమ్మం జిల్లాకు చెందిన నేతలతో పవన్ భేటీ అయ్యారని తెలుసుకున్న వారు లోపలకు వెళ్లాలని ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat