వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేతపై విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, బుధవారం ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జలీల్‌ఖాన్ ట్లాడుతూ.. జగన్ ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన శని అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. అదే నేను గెలిస్తే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా అంటూ వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు జలీల్ ఖాన్.
see also :
తన తండ్రి ప్రశ్నలకు షాక్ అయిన శ్రీరెడ్డి..!!
ఏంటేంటి.. ఎంపీల చేత రాజీనామా చేయించే దమ్ము నీకుందా..! అంటూ సీఎం చంద్రబాబుకే సవాల్ విసిరుతావా..?? అసలు దమ్ము అనే పదం నీ నాలుక పలకడానికి కూడా సరిపోదని జగన్‌ను ఎద్దేవ చేశారు జలీల్ ఖాన్. వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి జగన్‌పై, తనపై ఉన్న కేసుల మాఫీ కోసమే ప్రధాని చుట్టూ తిరుగుతున్నారని జలీల్‌ఖాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.