చల్లా రామకృష్ణారెడ్డి పేరు గుర్తుందా? ఎక్కడో విన్నట్లుందా? దాదాపు పాతికేళ్ల క్రితం ఆయనో సంచలనం. అది కూడా మామూలుగా కాదు. ఆయన్ను ఇంటర్వ్యూ చేసేందుకు మీడియా వాళ్లు సైతం వణికిపోయేవారు. అప్పుడెప్పుడో సన్ నెట్ వర్క్ వారి తేజ న్యూస్ లో చల్లారామకృష్ణా రెడ్డిని ఇప్పటికి టీవీ 9 చీఫ్ రవిప్రకాష్ ఓపెన్ ఇంటర్వ్యూ చేయటం.. సంచలనం సృష్టించింది. ఒకప్పుడు కర్నూలు జిల్లాలోని కోవేల కుంట్ల నియోజకవర్గ పరిధిలో కోవెలకుంట్ల మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణ రెడ్డి మాటే వేదంగా నడిచేది. తన చిత్రమైన మనస్తత్వంతో విచిత్రంగా వ్యవహరించే చల్లారామకృష్ణారెడ్డి మంత్రి కావాలన్నది జీవితాశయంగా చెబుతారు. వైఎస్ మరణం తర్వాత.. విభజన ఎపిసోడ్ల నేపథ్యంలో టీడీపీలో చేరాడు. అయితే గత ఎడాది మార్చిలో జిల్లాలో స్థానిక సంస్థల శాసనమండలి సభ్యత్వానికి జరిగిన ఎన్నికల్లో శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆగస్టులో నంద్యాల శాసనసభా స్థానం నుంచి పోటీకి తన సోదరుడైన శిల్పా మోహనరెడ్డికి అవకాశం కల్పించలేదన్న కారణంతో ఆయన పార్టీ మారారు. అయితే ముందుగా టీడీపీ తరఫున దక్కించుకున్న మండలి సభ్యత్వానికి రాజీనామా చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశించడంతో చక్రపాణిరెడ్డి పదవికి రాజీనామా చేశారు.
దీంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటు కోసం చల్లా రామకృష్ణారెడ్డి తెగ ప్రయత్నించారు. స్వంయంగా సీఎం చంద్రబాబును కలిసి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిందిగా కొరిన. ఈ విషయం మీద బాబు ఎలాంటి హామీ ఇవ్వకుండా టీడీపీ అభ్యర్థిగా మాజీమంత్రి కెయి ప్రభాకర్ ప్రకటించడంతో ఇక టీడీపీలోనే ఉంటే నా రాజకీయం ముగుస్తుంది అని తెలుసుకొని అతి త్వరలోనే వైసీపీలోకి చెరాలని అనుకుంటున్నట్లు సమచారం. అంతేకాదు నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచేందుకు తాను చేసిన కృషి అంతా ఇంతా కాదు. పార్టీ కోసం తాను కష్టపడుతున్నానన్న విషయాన్ని పక్కన పెడితే.. నంద్యాలలో పార్టీని గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇచ్చాను. మరి.. ఇంత కష్టపడుతున్ననాకు చంద్రబాబు ఏమి ఇవ్వలేదు అని మదనపడుతున్నట్లు సమచారం. దీంతో తన అనుచరులతో త్వరలనే సమావేశం అయ్యి కోవెలకుంట్ల మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణ రెడ్డి వైసీపీలో చేరికపై ప్రకటన ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.