ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు పై వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ప్రస్తుతం జగన్ చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర రాష్ట్ర రాజధాని అయిన అమరావతి ప్రాంతంలో కొనసాగుతుంది .ఈ ప్రజసంకల్ప యాత్రలో భాగంగా జగన్ ఉండవల్లి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టె ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు.రాష్ట్రానికి ఒకే ఒక మార్గంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని..అదే ప్రత్యేక హోదా అని చెప్పారు .
” ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అతి పెద్ద తప్పు ఏంటో తెలుసా? అన్నింటి కన్నా అన్యాయమైన మోసం ఏంటో తెలుసా ?.. ప్రత్యేక హోదా. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆ అంశాన్ని గట్టిగా ప్రధానమంత్రి మోదీని అడిగితే వచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు ఎండమావిగా తయారైంది.. దానికి చంద్రబాబు నాయుడే కారణం ” అని అన్నారు.
” కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లో అన్యాయం చేసిందని, ప్రత్యేక హోదా ఇవ్వలేదని, వైసీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.. చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే తమ పార్టీ ఎంపీలతో కూడా రాజీనామా చేయించి, నిరాహార దీక్షకు కూర్చుంటే దేశం మొత్తం చర్చనీయాంశంగా మారేది కాదా? అని అడుగుతున్నాను. మోదీ ప్రభుత్వం దిగివచ్చి ప్రత్యేక హోదాను ఇచ్చేది కాదా ? ” అని జగన్ చెప్పారు.