టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా రెండో ఏడాది విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు .అత్యంత విజయవంతమైన ఇంటర్నేషనల్ క్రికెటర్‌గా కోహ్లీ నిలవడంతో వరుసగా రెండోసారి అతన్ని ఈ అవార్డు వరించింది.అన్ని ఫార్మాట్లో అసాధారణ రీతిలో 2818 పరుగులు సాధించి ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. అయితే గతేడాది అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ళ జాబితాలో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ రెండో స్థానంలో ఉన్నాడు.రూట్ కంటే కోహ్లీ 700కి పైగా పరుగులు చేయడం ఇక్కడ విశేషం.
మరో వైపు విమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు భారత మహిళల జట్టు సారథి మిథాలీ రాజ్‌కు చోటు దక్కింది.భారత జట్టును మహిళల ప్రపంచకప్ ఫైనల్ వరకు తీసుకెళ్లిన మిథాలీ రాజ్ మహిళల విభాగంలో వన్డేల్లో ఆల్‌టైమ్ లీడింగ్ రన్-స్కోరర్‌గా నిలిచింది.