కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు, ఆయన అనుచరులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో సీపీఎం, ఎంబీసీ నాయకులపై దాడికి దిగారు. నగరంలోని అంబర్ పేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నివాళులర్పించిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న వీహెచ్, ఆయన అనుచరులు సీపీఎం నాయకులు, కార్యకర్తలతో ఘర్షణకు దిగారు. దీనితో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి.ఈ సందర్భంగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
