మంత్రి గంటా రూ.1000 కోట్ల అవినీతి భాగోతాన్ని రట్టు చేసిన మరో టీడీపీ మంత్రి..!! అవును, ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రూ.వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. అయితే, వెయ్యికోట్ల అవినీతి భాగోతంలో మంత్రి గంటాతోపాటు సంబంధం ఉన్న మరో అధికారి పేరు కూడా చెప్తాను. అయితే, మంత్రి గంటా శ్రీనివాసరావు కనుసన్నల్లో జరిగిన ఈ అవినీతి భాగోతమంతా నిధుల రూపంలో చేసింది కాదని, వెయ్యి కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కాజేసేందుకు మంత్రి గంటా కుట్ర పన్నారని, అందుకు సంబంధించిన ప్రయత్నాలను ఇప్పటికే ముమ్మరం చేశారంటూ ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక అసలు విషయానికొస్తే.. మంత్రి గంటా వెయ్యి కోట్ల అవినీతికి సంబంధించిన వివరాలను మరో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మీడియాకు ఈ విధంగా చెప్పుకొచ్చారు. అయితే, గతంలో విశాఖపట్నం డెయిఈ పాలకవర్గ సమావేశాన్ని మంత్రి గంటా గుట్టుచప్పుడు కాకుండా గోవాలో నిర్వహించడాన్ని మంత్రి అయ్యన్న గుర్తు చేశారు. గోవాలో గుట్టుచప్పుడు కాకుండా జరిగిన సమావేశంలో విశాఖ డెయిరీకి సంబంధించిన వెయ్యికోట్లు విలువ చేసే భూమిని కాజేసేందుకు మంత్రి గంటా ప్రణాళికలు రచించారని, అయితే, మంత్రి గంటా వెయ్యి కోట్ల అవినీతి భాగోతానికి విశాఖ డెయిరీకి చెందిన అత్యున్నతస్థాయి అధికారి సహకరిస్తున్నారని తెలిపారు. మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ కేబినెట్‌లో పెనుదుమారం రేపుతున్నాయి. ఏదేమైనా.. ఇప్పటికే భారీ స్థాయిలో అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు సర్కార్ .. ఇప్పుడు మంత్రులకు సంబంధించిన అవినీతి భాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో రాజకీయంగా మరింత కష్టాల్లో మునిగిపోయింది. ఇవాళ మంత్రి గంటా శ్రీనివాసరావు అవినీతి బట్టబయలైనట్టే.. రేపు మరో మంత్రి అవినీతి భాగోతం బట్టబయలు కాకపోదు మరీ..!!