సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ విషయంలో మొన్న గాయత్రీ గుప్తా, నేడు శ్రీ రెడ్డి, మధవి లత. ఇలా పలువురు అప్ కమింగ్ హీరోయిన్ లు అవకాశాల కోసం తమకు ఎదురైన చేదు అనుభవాలను వ్యక్తపరుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు పలు చానెల్స్ లో తన బాధను చెప్పుకున్న శ్రీ రెడ్డి మొన్న ఫిల్మ్ చాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు మహిళల పట్ల జరుగుతున్నా అన్యాయలు ఇంత దారుణమా అని ఏ మీడియాలో చూసిన నటి శ్రీరెడ్డి వాఖ్యలే. ఈ టాలీవుడ్ సినిమా పెద్దలు ఆధిపత్యంతో ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారు, సభ్య సమాజంలో తెలుగు మహిళలకు ఉన్న గౌరవాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, కేవలం ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలకు వారి పిల్లలకు డబ్బు కావాలి సుఖము కావాలి స్త్రీల తో ఆడుకుంటున్నారని శ్రీరెడ్డి గతంలో కొందరు తనతో ఎలా ప్రవర్తించారో తెలుపుతూ కొన్ని ఫోటోలను బయటపెట్టిన విషయం తెలిసిందే.
అయితే దీనికి ముందు శ్రీరెడ్డి ఉదంతం కాస్త సద్దుమణిగిద్దాం అని తెరవెనక ప్రయత్నాలు చేస్తున్న టైమ్ లో మా సంఘ పెద్దలు అంతా కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఆమెను ఎంత రెచ్చగొట్టాలో అంతా రెచ్చగొట్టారు. కార్డు ఇవ్వంకాక ఇవ్వమని చెప్పడం వేరు. అసలు సినిమాల్లో వేషాలు వేయనివ్వము. ఆమెతో ఎవరైనా నటిస్తే వెలెస్తాం అంటూ ఫత్వా జారీ చేసారు.ఇది రెండు విధాలుగా రివర్స్ అయింది. ఇంతవరకు వచ్చాక ఇక దాచడం ఎందుకు అని శ్రీరెడ్డి లీక్స్ అంటూ సురేష్ బాబు కొడుకు అభిరామ్ వ్యవహారం బయటపెట్టింది. ‘ఇండియన్ ఐడల్ శ్రీరామ్, అభిరామ్ మీరిద్దరూ రాముడు పేరు పెట్టుకుని.. ఛీ.. ఛీ’ అని వ్యాఖ్యానించింది. దీనంతటికీ మూలం మా సంఘ పెద్దలు, శివాజీరాజా లాంటి వాళ్లు రెచ్చగొట్టడమే కారణం అని గుసగుసలు వినిపిస్తున్నాయి. శివాజీ రాజా రెచ్చిపోయి శ్రీరెడ్డిని రెచ్చగొట్టారు. ఇప్పుడు మరింత ముదిరింది. దాంతో సినిమా పెద్దలు చాలామంది శివాజీరాజాదే తప్పు అన్నట్లు, అంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో పక్క ఇంతకాలానికి శ్రీరెడ్డి పోరాటం మరో మలుపు తిరిగిందని, ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు కనకదుర్గగా మారిందని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.