శ్రీరెడ్డి, టాలీవుడ్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అలా కాకుండా, తెలుగు సినీ ఇండస్ర్టీలో తెలుగు వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారి జీవనోపాధికి తోడ్పాటునందించాలని డిమాండ్ చేస్తూ సినీ ఇండస్ర్టీపై యుద్ధం ప్రకటించింది. అయితే, టాలీవుడ్లో తెలుగువారికి అవకాశాలు దక్కకపోవడాని గల కారణాలను మీడియా వేదికగా బట్టబయలు చేసింది శ్రీరెడ్డి. తెలుగు నటీ నటులు నిర్మాతలతో, డైరెక్టర్లతో, హీరోలతో పడుకోకపోవడమే అవకాశాలు రాకపోవడానికి కారణమని బల్లగుద్ది మరీ చెప్పింది. ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లుగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న వారంతా అలా అవకాశాలు చేజిక్కించుకున్న వారేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి.
అయితే, మంగళవారం ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీరెడ్డి.. సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి శారీరకంగా వాడుకున్న ఓ బఢా నిర్మాత కొడుకు నన్ను శారీరకంగా వాడుకున్నాడని చెప్పింది. అయితే, ఆ బఢా ప్రొడ్యూసర్ ఎవరో.. నిన్ను శారీరకంగా వాడుకున్న వ్యక్తి ఎవరో చెప్పి.. మీరు చెప్తున్న మాటలు వాస్తవమే అని నమ్మేలా పేర్లు బయటపెట్టండి అని ఇంటర్వ్యూ చేసే యాంకర్ శ్రీరెడ్డిని అడగ్గా.. ఆ వెంటనే తన సెల్‌ఫోన్‌లోని ఫోటోలను మీడియాకు విడుదల చేసింది.
తనతో రాసలీలలు నడిపిన ఆ వ్యక్తి ఎవరో కాదని, టాలీవుడ్లో బఢా నిర్మాతగా ఓ వెలుగు వెలుగుతున్న సురేష్‌బాబు తనయుడు అభిరామ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అలా శ్రీరెడ్డి ఒక్కసారిగా అభిరామ్ ఫోటోలు బయటపెట్టడంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అవును, అభిరామ్ నాకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి… నన్ను శారీరకంగా వాడుకున్నాడు అంటూ మీడియా ముఖంగా చెప్పింది శ్రీరెడ్డి.
టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలకు అన్యాయం జరుగుతుందని పోరాటం చేస్తున్న నాకు మా అసోసియేషన్ సభ్యత్వం రద్దు చేసి.. సినీ ఇండస్ర్టీ నుంచి వెలేస్తారా..? ఇప్పుడు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ తనయుడి రాజలీలలను ఆధారాలతో సహా బయటపెట్టా కదా..!! మా అసోసియేషన్‌కు దమ్ముంటే దగ్గుబాటి ఫ్యామిలీని సినీ ఇండస్ర్టీ నుంచి వెలేయగలదా..! దగ్గుబాటి అభిరామ్, అతన్ని ప్రోత్సహించిన ఆయన తండ్రి, అండగా నిలిచిన వెంకటేష్, రాణాలను తెలుగు సినీ ఇండస్ర్టీ నుంచి వెలేయగల దమ్ము మా అసోసియేషన్‌కు ఉందా..? అంటూ శ్రీరెడ్డి ప్రశ్నించింది.