తెలుగు సినీ ఇండస్ట్రీ లో తెలుగు నటీమణులకు అవకాశం ఇవ్వడం లేదు ,అవకాశాలు ఇస్తామని చెప్పి నమ్మించి వాడుకొని వదిలేతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా నటి శ్రీ రెడ్డి మీడియా కెక్కి పోరాటం చేస్తూ..సోషల్ మీడియా ద్వార పలువురి భాగోతాలు లీక్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఇవాళ శ్రీరెడ్డికి ఓయూ విద్యార్ధులు అండగా నిలిచారు.ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణకు వచ్చిన శ్రీరెడ్డి.. చిత్రపరిశ్రమలో తనకు జరిగిన అన్యాయంపై ఓయూ విద్యార్థులతో మాట్లాడి కంటతడిపెట్టుకుంది. తనకు మద్దతు ఇవ్వాలని కోరింది.ఈ సందర్భంగా శ్రీరెడ్డికి మద్దతు తెలుపుతున్నట్లు ఓయూ విద్యార్థి జేఏసీ ప్రకటించింది.అంతేకాకుండా సినీ ఇండస్ట్రీ లో జరుగుతున్న అక్రమాలను ఖండిస్తూ ఓయూ స్టూడెంట్స్ నిరసన నినాదాలు చేశారు.