శ్రీరెడ్డి.ప్రస్తుతం ఎక్కడ చూసినా,ఏ నోట విన్నా శ్రీ రెడ్డి సృష్టిస్తున్న సంచలనమే వినపడుతుంది.శ్రీరెడ్డి లీక్స్ తో తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించిన శ్రీ రెడ్డి అనూహ్య రీతిలో మద్దతు ను కూడగడుతోంది.ఇప్పటికే పలు మహిళా సంఘాలు ,ఐక్య వేదికలు శ్రీరెడ్డికి అండగా నిలుస్తున్నాయి.అయితే తాజాగా టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద౦గా మరీనా శ్రీరెడ్డి విషయం పై తన తల్లి స్పందించింది.
శ్రీరెడ్డి తల్లి ఇవాళ ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ఏ కన్నతల్లి తన కూతురు ఇలాంటి పరిస్థితుల్లో చూడాలని కోరుకోదు. ఏ తల్లి తన కూతురు గురించి వినకూడని మాటలు.. చూడకూడనవి నేను చూశా అంటూ భావోద్వేగంతో శ్రీరెడ్డి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు.శ్రీరెడ్డి సొంత ఊరు విజయవాడలోని కంకిపాడు.శ్రీ చిన్నప్పటి నుండి చాలా మొండిగా ఉండేదన్నారు.ఆమె మొదట్లో ఒక బ్యూటీ పార్లర్ నిర్వహించేదని..ఆ క్రమంలోనే తనకు వివాహం జరిగిందన్నారు.అయితే మొదట్లో వరి కాపురం మంచిగానే జరిగిన ఆ తరువాత కొన్ని మనస్పర్ధల కారణంగా విడిపోయారని శ్రీ రెడ్డి తల్లి చెప్పింది.