తెలుగు సినీ ఇండస్ర్టీని ఏలుతున్న కుటుంబాల్లో ఒకటైన.. మెగా కుటుంబంలోని మెగా బ్రదర్, సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సినీ నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇటీవల కాలంలో తెలుగు సినీ ఇండస్ర్టీలో మా అసోసియేషన్ వర్సెస్ శ్రీరెడ్డిగా మారిన విషయం తెలిసిందే. తెలుగు వారికి సినిమా అవకాశాలు కల్పించకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోల పక్కల్లో పడుకునే అగ్రిమెంట్‌తో అమ్మాయిలను దిగుమతి చేసి హీరోయిన్లుగా ఛాన్సులు ఇస్తున్నారంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
see also : అభిరామ్..నువ్వు ఏంట్రా..! అసలు నీకు సిగ్గుందా..!! నన్ను ఎలా వాడుకున్నావో.. నాకు తెలుసు..!!
కాగా, మంగళవారం ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి మాట్లాడుతూ.. ఒక మహిళ అయి ఉండి.. సినిమా ఇండస్ర్టీలో నటిగా రాణిస్తున్న సత్య చౌదరి .. మహిళలను నలిపితే.. నలిపించుకోవాలంటూ మాట్లాడటం సమాజానికి సిగ్గుచేటన్నారు. డైరెక్టర్లు, హీరోలు పక్కలో పడుకోవాలా..? తెలుగు సినీ ఇండస్ర్టీలో ప్రొడ్యూసర్లు ఏం చెప్పినా మేం చెయ్యాలా..? సినిమా సక్సెస్ మీట్లలో నీతులు చెప్పే సినిమా వాళ్లు.. తెర వెనుక మాత్రం చెప్పేవి తారంగ నీతులు దూరేవి దొమ్మరి గుడిసెలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి.
ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. సినిమా ఇండస్ర్టీ నుంచి నన్ను బ్యాన్ చేస్తారా..? ఎందుకు వెలేస్తారు..? నేనేమన్నా అంటరాని దాన్నా..? తెరమీద రొమాన్స్‌లు, అమ్మాయిల మూతులు నాకే మీకు నన్ను వెలేసే అర్హత లేదు అని శ్రీరెడ్డి మా అసోసియేషన్‌కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది. సినిమా ఇండస్ర్టీలో మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారు లేరా..? ముందు వారిని వెలేయండి, ఆ తరువాత నన్ను వెలేద్దురు అంటూ పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి.