తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకానికి నిధులు విడుదల చేసింది.ఖరిఫ్ సీజన్ కోసం రూ.6 వేల కోట్లు విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణ సర్కారు రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున సాగుకు అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందజేయనుంది .ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు బంధు చెక్కులు పంపిణీ చేయనుంది.ఇప్పటికే రైతు బంధు చెక్కుల ముద్రణ ప్రారంభమైన విషయం తెలిసిందే.