ఐదారు రాష్ట్రాల్లో 32 లక్షల మందిని పదివేల కోట్లకు పైనే ముంచింది అగ్రిగోల్డ్ సంస్థ. ఆ ఐదారు రాష్ట్రాల్లోనూ అగ్రిగోల్డ్ బాధితులు భారీగానే ఉన్నారు. అంతేకాకుండా, ఆ ఐదారు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తులు భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు, అగ్రిగోల్డ్ బాధితులు పదే పదే కోరినా.. అవేవీ పట్టించుకోని చంద్రబాబు సర్కార్ మాత్రం ఏపీ పోలీసులతోనే దర్యాప్తు చేయించేందుకు సిద్ధమైంది. ఆ తరువాత అగ్రిగోల్డ్ భూములను బినామీ పేర్లతో కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాత్రం ఒక అడుగు ముందుకేసి అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన భూములను ప్రభుత్వ సహకారంతో, కారుచౌక ధరకు కొనుగోలు చేసి తన భార్య పేరు మీద రిజిస్ర్టేషన్ చేయించారు.
see also :
పవన్ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!
అగ్రిగోల్డ్ కంపెనీని అమాంతం మూసివేసిన వెంటనే.. మీకు డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకునే బాధ్యత నాది.. మీకు ఏం కాదు అంటూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా ఇచ్చారు. ఇలా చంద్రబాబు నాయుడు పలికిన చిలక పలుకులు విన్న అగ్రిగోల్డ్ బాధితులు.. అసలే కష్టాల్లో ఉన్నాం కదా.., అందులోనూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు… మా డబ్బులు మాకు తెచ్చిస్తాడులే అని నమ్మారు. అంతేకాకుండా, అగ్రిగోల్డ్‌కు 20వేల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయని, అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన మొత్తం కన్నా.. చాలా ఎక్కువగానే ఆస్తులు ఉన్నాయంటూ సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.
అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి, బాధితులందరికీ చెల్లింపులు చేస్తామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మొదట్లో ఓ సంస్థ ముందుకొచ్చి.. అగ్రిగోల్డ్ ఆస్తులను తాము కొనుగోలు చేసి బాధితులకు చెల్లించాల్సిన నగదును చెల్లిస్తామని చెప్పింది. అయితే, కొన్ని నెలల తరువాత ఆ సంస్థ చేతులెత్తేసింది. ఆ తరువాత ఎస్ఎల్‌జీ సంస్థ అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలుకు ముందుకొచ్చింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు సుభాష్ చందర్ ఎవరో కాదు. సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అమర్‌సింగ్‌కు అగ్ర సోదరుడే.
అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు సుభాష్ చందర్‌తోపాటు అమర్‌సింగ్ కూడా ఏపీకి వచ్చారు. విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికే తాము ఏపీకి వచ్చామని, అంతకు మించి రాజకీయాలు, వ్యాపారాలు లేవని అమర్ సింగే అప్పట్లో అన్నారు. అయితే, ఎస్ఎల్‌జీ సంస్థ అప్పట్లోనే అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను అంచనా వేసేందుకు ఓ సర్వే సంస్థను నియమించింది. ఇంచుమించు 90 శాతం దర్యాప్తు పూర్తయిందని, అగ్రిగోల్డ్ బాధితులకు ఇవ్వాల్సిన దానికన్నా అగ్రిగోల్డ్ ఆస్తులు ఎక్కువగానే ఉన్నాయని, ఎస్ఎల్‌జీ స్పష్టం చేసింది. కానీ, అంతలోనే ఎస్ఎల్‌జీ సంస్థ యూటర్న్ తీసుకుంది.
ఇటీవల కాలంలో హైకోర్టులో తన వాదనలు వినిపించిన ఎస్ఎల్‌జీ సంస్థ.. అగ్రిగోల్డ్ అప్పులు పదివేల కోట్లకుపైగానే ఉన్నాయని,, ఆస్తులు మాత్రం రెండన్నరవేల కోట్లకు మించి లేవని చెప్పుకొచ్చింది. ఈ తరుణంలో అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని చక్కదిద్దలేమని చేతులెత్తేసింది ఎస్ఎల్‌జీ సంస్థ. అయితే, తమకు పది వారాల గడువు ఇస్తే చంద్రబాబు సర్కార్‌తో కలిసి అగ్రిగోల్డ్ భూములను డెవెలప్ చేసేందుకు యత్నిస్తామని, ఏపీ ప్రభుత్వంతో కూడా ఇందుకు సంబంధించి చర్చలు జరిపామని, అందుకు సీఎం చంద్రబాబు కూడా ఒప్పుకున్నారని ఎస్ఎల్‌జీ సంస్థ స్పష్టం చేసింది.
అయితే, ఎస్ఎల్‌జీ – ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య జరిగిన వ్యవహారాన్ని హైకోర్టు తప్పుబట్టింది. మూడో వ్యక్తి అయిన అమర్‌సింగ్‌కు అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదని న్యాయమూర్తులు తేల్చి చెప్పారు. దీనిపై ఏపీ ప్రభుత్వ వైఖరి ఏంటని హైకోర్టు నిలదీయగా.. ప్రభుత్వ తరుపు న్యాయవాది రెండు వారాల గడువు అడిగారు. ఇంతకాలం ఎస్ఎల్‌జీ సంస్థ అగ్రిగోల్డ్‌ని టేకోవర్ చేసి బాధితులందరికీ వారి వారి సొమ్మును చెల్లిస్తుందని బాధితులు ఆశగా ఎదురు చూశారు. అయితే, ఆ సంస్థ యూటర్న్ తీసుకోవడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఈ వ్యవహారాన్ని నిశితంఆ పరిశీలిస్తే చాలా అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు బాధితులు.
నిన్నటి దాక అగ్రిగోల్డ్ ను తీసుకుంటామన్న ఎస్ఎల్‌జీ ఉన్నట్టుండి వెనక్కి పోవడమేంటి..? ప్రత్యేక హోదా కోసం ఢిల్లీకి వచ్చానన్న చంద్రబాబు నాయుడు పార్లమెంట్ భవనంలో జీ సంస్థ అధినేత సుభాష్ చంద్రతోపాటు ఆయన సోదరులు అమర్‌సింగ్‌ను కలిసిన తరువాతనే ఈ పరిణామం చోటుచేసుకోవడమేంటి..? అని ప్రశ్నిస్తూ విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి.
అగ్రిగోల్డ్ సంస్థను టేకోవర్ చేస్తామనిన ఎస్ఎల్‌జీ సంస్థ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రయివేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడానికి ఆసక్తి చూపడం వెనుక వేల కోట్ల కుంభకోణం ఉందని అగ్రిగోల్డ్ బాధితులు అనుమానిస్తున్నారు. అగ్రిగోల్డ్ టేకోవర్ నుంచి వెనక్కి వెళ్లిపోవాలని చంద్రబాబు నాయుడే అమర్‌సింగ్ అండ్ కో కి చెప్పారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్రిగోల్డ్ మూతపడ్డప్పుడు చంద్రబాబు కేబినేట్‌లోని మంత్రులు, సీఐడీ అధికారులు కూడా సంస్థకు సంబంధించి రూ.20వేల కోట్లకు పైబడే ఆస్తులు ఉన్నాయని, భయపడాల్సిన అవసరం లేదంటూ బాధితులకు భరోసా ఇచ్చారు. హైకోర్టుకు సైతం సీబీఐ అధికారులు, మంత్రులు ఇదే విషయం చెప్పారు. ఇప్పుడు అగ్రిగోల్డ్ ఆస్తులు విలువ రెండున్నరవేల కోట్లకు ఎందుకు పడిపోయింది..? ఈ వ్యవహారం వెనుక చంద్రబాబు పెద్ద కుంభకోణానికే పాల్పడ్డారని అన్నారు అగ్రిగోల్డ్ వ్యవహారంపై ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసిన రమేష్ బాబు. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన కీలక ఆస్తులపై టీడీపీ నేతల కన్నుపడిందని, ఆ నేపథ్యంలోనే రూ.20వేల కోట్లకు పైబడిన అగ్రిగోల్డ్ ఆస్తులు ఒక్కసారిగా రెండున్నరవేల కోట్ల రూపాయలకు పడిపోయిందని ఆయన విమర్శించారు.
టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి తోచిన ఆస్తులను… వారి సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారని అందరూ కలిసి మరోసారి అగ్రిగోల్డ్ బాధితులను మరోసారి ముంచుతున్నారని బాధితులతోపాటు ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఐదారు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకం విషయంలో కానీ, బాధితులకు చెల్లింపుల విషయంలో కానీ, ఏపీ ప్రభుత్వం ఒక్కటే తన ఇష్టానుసారం వ్యవహరించడం ఏంటని అగ్రిగోల్డ్ బాధితులు నిలదీస్తున్నారు. అగ్రిగోల్డ్ బాధితులు ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ఒక్కతాటిపైకి రావాలని వారు కోరుతున్నారు. ప్రజలను ముంచిన దోపిడీ దొంగలు ప్రశాంతంగా ఉన్నారు. ఆ దోపిడీ దొంగలు కూడబెట్టిన ప్రజా ధనాన్ని కొల్లగొట్టిన పాలకపక్ష నేతలు హాయిగా ఉన్నారు. అగ్రి గోల్డ్ బాధితుల కష్టాలను తీర్చే నాధుడు ఎవరో మరీ..!!