ఏపీ కి విభజన చట్టంలో ఉన్నట్లు అమలు కావాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు మిథున్ రెడ్డి,అవినాష్ రెడ్డి,మేకపాటి,వైవీ సుబ్బారెడ్డి,వరప్రసాద్ గత ఆరు రోజులుగా అమర నిరాహార దీక్ష చేస్తున్న సంగతి విదితమే.
అయితే వైసీపీ ఎంపీలు చేస్తున్న దీక్ష గురించి అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ తమకు నాలుగు ఏండ్లుగా పట్టిన కొవ్వును కరిగించుకోవడానికి దేశ రాజధాని ఢిల్లీలో దీక్షలు చేస్తున్నారు అని విమర్శించారు.తమ పార్టీకి చెందిన ఎంపీలపై కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందిస్తూ కొవ్వు పట్టిన నేతలకు బ్రాండ్ అంబాసిడర్లు టీడీపీ నేతలే ..
వాళ్ళను చూస్తుంటేనే అర్ధమవుతుంది ఎంత కొవ్వు పట్టిందో ..ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం దీక్షలు చేస్తున్న తమ పార్టీ ఎంపీలను అవహేళన చేస్తున్నట్లు మాట్లాడటం కరెక్ట్ కాదు అని ..డబ్బులు తిని కొవ్వు పెంచుకున్న పందుల్లా ఉన్న టీడీపీ నేతల బలుపును తక్కువ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని ఆమె విరుచుకుపడ్డారు ..