‘సినిమా ఇండస్ట్రీలో తెలుగు మహిళల పట్ల జరుగుతున్నా అన్యాయం , అవమానాలు , వ్యభిచారంలు , చాల బాధాకరం, తెలుగు సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మన తెలుగు రాష్ట్రాలు, అలాంటిది. ఈ సినిమా పెద్దలు ఆధిపత్యంతో ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారు, సభ్య సమాజంలో తెలుగు మహిళలకు ఉన్న గౌరవాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, కేవలం ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలకు వారి పిల్లలకు డబ్బు కావాలి సుఖము కావాలి స్త్రీల తో ఆడుకుంటున్నారని శ్రీరెడ్డి, గతంలో కొందరు తనతో ఎలా ప్రవర్తించారో తెలుపుతూ కొన్ని ఫోటోలను బయటపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అనూహ్యంగా నిర్మాత దిల్ రాజును టార్గెట్ చేస్తూ ఆమె పెట్టిన పోస్ట్ ప్రకంపనలు రేపుతోంది. టాలీవుడ్ నుంచి దిల్ రాజు పోతే శని వదిలిపోతుందని, ఆయన కుల రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించింది. ఆయన చేతుల్లో ఎంతో మంది నలిగిపోతున్నారని ఆరోపించింది. ‘కుల రాజకీయాలు వద్దన్నా. ఆడ పిల్లలన్నా. బతకనిద్దామన్నా పాపం. దిల్ రాజు (రెడ్డి) గారూ… ప్లీజ్ సంకెళ్లు వేసిన కళామతల్లిని బంధ విముక్తురాలిని చేయండి. మీరు పోతే శని వదిలిపోయింది అనుకుంటారు. బతికుండగానే దయచేసి మారండి. వట్టి చేతులతో పోతాం. మంచిపేరుతో పోదామన్నా మనమందరం. త్యాగం అన్నా… టాలెంట్ ను చంపొద్దు అన్నా. మీరంతా మంచివారు. దయచేసి నా విజ్ఞప్తిని పరిశీలించండి’ అని శ్రీరెడ్డి పేర్కొంది. తాము అమ్మాయిలమని, అంగట్లో సరుకులం కాదంటూ మరో పోస్టు పెట్టింది.
